How to play violin in telugu
వయొలిన్
వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు. చాలా వయోలిన్లు బోలు చెక్క శరీరాన్ని కలిగి ఉంటాయి. తంత్రీ వాయిద్య కుటుంబంలో అతి చిన్నది, అతి ఎక్కువ శృతి కలది. వయోలిన్లో పిక్కోలో, కిట్ వయోలిన్‌తో సహా చిన్న వయోలిన్-రకం వాయిద్యాలు ఉన్నాయి, అయితే ఇవి వాస్తవంగా ఉపయోగించబడవు. వయోలిన్ సాధారణంగా నాలుగు తీగలను కలిగి ఉంటుంది. కర్ణాటక సంగీతంలో సాధారణంగా మందర స్థాయి షడ్జమం (స), మందర స్థాయి పంచమం (ప), మధ్యమ స్థాయి షడ్జమం (స), మధ్యమ స్థాయి పంచమం (ప) లకి శృతి చేయబడి ఉంటుంది, అలాగే పాశ్చాత్య సంగీతంలో G3, D4, A4, E5 లకు శ్రుతి చేయబడుతుంది. సాధారణంగా దాని తీగలను కమానుతో గియ్యడం ద్వారా వాయిస్తారు. అయినప్పటికీ వేళ్లతో తీగలను మీటడం (పిజ్జికాటో) లేదా కామాను చివర చెక్కతో తీగలను మీటడం ద్వారా కూడా వాయించవచ్చు.
వయోలిన్ మొట్టమొదట 16 వ శతాబ్దపు ఇటలీలో తయ్యారు చెయ్యబడింది. 18, 19 వ శతాబ్దాలలో ఈ పరికరానికి మరింత శక్తివంతమైన ధ్వని ఇవ్వడానికి మరికొన్ని మార్పులు జరిగాయి. ఐరోపాలో, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వయోలా వంటి ఇతర తీగల వాయిద్యాల అభివృద్ధికి ఇది ఆధారం. భారతదేశంలో వయోలిన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వాడుకలోకి వచ్చింది. దీనిని ముత్తుస్వా